Publication
ఉత్తిష్ఠపురుషి
Uttishtapurushi
Mahāvidyā Pancaśati Mantrasāra Sarvasvam
Dr. Jammulamadaka Anjaneya Sharma (Ātmānandanātha)
Published 25th Jun 2025
Publisher: Vedanta Vedika
Language: Telugu
About the publication
వేయిసూర్యుల కాంతితో ప్రకాశిస్తూ, ఎర్రనివస్త్రాలు ధరించి, నాలుగుచేతులలో శంఖం, చక్రం, ధనుస్సు, బాణాలను ధరించి, సింహవాహనమెక్కి అడవిలోనివసిస్తూ సర్వఆపదలను హరించేదేవి శ్రీవనదుర్గా. మంత్రశాస్త్రంలో శ్రీవనదుర్గా-మహావిద్యా అత్యంత శక్తివంతమైన సాధనగా చెప్పబడింది. శత్రుభయాలు, నరదృష్టి, భూత-ప్రేత బాధలు, దారిద్య్రం, మరియు సర్వఆపదలనుండి రక్షణపొందడానికి వనదుర్గాఉపాసన విశేషమైనఫలితాలను ఇస్తుంది. మహావిద్యోపాసనాభ్యాసం దృఢతరమైనప్పుడు తురీయ, సహజ, వైరాగ్యం బలపడినప్పుడు, జాగ్రత్తులోసంచరిస్తున్నా, ప్రపంచవ్యవహారాలను సంబోధిస్తున్నా, బుద్ధిసర్వదా ఆ తురీయరసాస్వాదనలో రంజితమైఉంటుంది. వశిన్యాదివాగ్దేవతలు శ్రీమాతను దుర్గాభవానిగా గుర్తించి 'దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా' అనికీర్తించారు. 'దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసేనమః' అనికీర్తించింది యజురారణ్యకం. 'నమామి భవభీతోహమ్ సంసారార్ణవ తారిణీమ్' అని ధ్యానించింది అథర్వశీర్షం. 'సంవిత్ స్వరూప బిసకందల కందరూపే' అని స్తుతించింది కల్పకౌస్తుభం. ‘చక్కగా తరింపచేయగలిగిన సాధన మహావిద్యాసాధన అన్నారు భరద్వాజమహర్షి’. డా. జమ్ములమడక ఆంజనేయశర్మ గారు రచించిన ఈ ‘ఉత్తిష్ఠ-పురుషి’ శ్రీమహావిద్యా మంత్రసారసర్వస్వం. దీనివిలువ అమూల్యం.