Rahastarpaṇam

Publication

రహస్తర్పణం

Rahastarpaṇam

Dr. Jammulamadaka Anjaneya Sharma (Ātmānandanātha)

Published 1st June 2019

Publisher: Vedanta Vedika

Language: Telugu

About the publication

'రహస్తర్పణం' (రహస్య తర్పణం) అనేది హిందూధర్మంలో, ప్రత్యేకించి శాక్తతంత్రం మరియు శ్రీవిద్యాఉపాసనలో ఉపయోగించే ఒకఅత్యంత గూఢమైన లేదా అంతర్గత పూజావిధానం. రహః (రహస్యం): అత్యంత అప్రకటితమైనది, గూఢమైనది లేదా రహస్యమైనది; తర్పణం: దేవతలను, పితృదేవతలను లేదా గురువులను తృప్తిపరచడం. రహస్తర్పణం అంటే 'రహస్యమైన’ లేదా ‘అంతర్ముఖమైన’ అర్ఘ్యసమర్పణద్వారా దేవతనుతృప్తిపరచడం. ‘రహస్తర్పణం’ అంతర్యాగం (ఆంతరంగిక సాధన). సాధకుడు తనశరీరంలోఉన్న కుండలినీశక్తిని మూలాధారంనుండి సహస్రారచక్రం వరకుతీసుకెళ్లి, అక్కడ అమృతబిందువులను పరదేవతకి సమర్పించడాన్ని అంతర్గత రహస్తర్పణం అంటారు. రహస్తర్పణఉద్దేశ్యం, గమ్యం, సంకల్పం, ఆత్మశుద్ధి సాధన, అహంకారాన్ని నశింపచేసుకోవడం మరియు లలితాపరాభట్టారిక యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్నిపొందడం. సమస్తవిశ్వాన్ని లీలగాపాలిస్తూ, అత్యున్నతమైన స్థానంలోప్రకాశించే పరమసామ్రాజ్ఞి జగన్మాత. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులకు కూడా పైనఉంటూ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే పంచకృత్యాలను నిర్వహించే లలితాపరాభట్టారికా రహస్యాలను శ్రీజమ్ములమడక ఆంజనేయశర్మ గారు ఈ గ్రంథంలో అతిసుందరంగా విచారించారు, అర్థవంతంగా పరిశీలించారు, సమగ్రంగా చర్చించారు.