Publication
నిణ్యం - చాముండా హృదయమ్
Niṇyam - Ćamundā Hrudayam
Dr. Jammulamadaka Anjaneya Sharma (Ātmānandanātha)
Published 22nd Feb 2025
Publisher: Vedanta Vedika
Language: Telugu
About the publication
తంత్ర, ఆగమ, పారమార్ధిక సాహిత్యంలో కొన్నిగ్రంథాలు కేవలంతత్వజ్ఞానాన్ని అందించేవిగా మాత్రమేగాక, సాక్షాత్తు దైవికశక్తిని ప్రసరించే సజీవసాధనాలుగా నిలుస్తాయి. ఆ రకమైన తాంత్రికశాస్త్రాలలో, రహస్యవిద్యల్లో, శ్రీపరాశక్తియొక్క అత్యంతశక్తివంతమైన, ఉగ్రరూపిణి అయిన చాముండేశ్వరీదేవి అనుగ్రహాన్నిఅందించే అరుదైన, ఆంతరంగికమైన, దివ్యమైన ఆవిష్కరణమే 'నిణ్యం-చాముండాహృదయమ్'. ‘నిణ్యం’ నిత్యమైనది, శాశ్వతమైనది, గుప్తమైనది, నియమబద్ధమైనది, సాధారణదృష్టికి సులభంగా గోచరించని లోతైనఅంశం. నిణ్యం అత్యంతపవిత్రమైన గుప్తజ్ఞానం. మార్కండేయపురాణంలో అంతర్భాగమైన దేవీమాహాత్మ్యం (శ్రీచండీసప్తశతి) కేవలం అసురసంహారగాథ మాత్రమేకాదు. ఆధ్యాత్మికంగా ఇదిమానవ అంతశ్చేతనలో జరిగే అజ్ఞాన-జ్ఞాన సంగ్రామం, జీవుడికిలభించే ముక్తిమార్గం. 13 అధ్యాయాలు, 700 మంత్రాలతో కూడిన ఈ పారాయణలోని అంతరార్థం, అధ్యాత్మికవివృతి ‘చాముండాహృదయమ్’. డా.జమ్ములమడక ఆంజనేయశర్మ గారు శ్రీచండీసప్తశతిలోని పరమార్థాన్ని, దేవీతత్వాన్ని అత్యంతసుందరంగా, ప్రాంజలమైనభాషలో వర్ణించారు. శ్రీ శర్మగారు సప్తశతిలోనియుద్ధాన్ని కేవలంఏనాడోజరిగిన చారిత్రకఘట్టంగాకాక, ప్రతిసాధకుని అంతరంగంలో నిరంతరంజరిగే దేవాసురసంగ్రామంగా వర్ణించారు. మనలోనిసద్గుణాలు దేవతలని, దుర్గుణాలు (కామ,క్రోధ,మోహాదులు) రాక్షసులని ఆయన స్పష్టంచేశారు. ఈ నిణ్యవ్యాఖ్యానాన్ని చదవడంఅనేది చండీపారాయణచేసే ప్రతిసాధకుడికి అమ్మవారి దివ్యഅనుగ్రహాన్ని, ఉన్నతిని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం.